కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఇటుక బట్టీ దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందింది. ట్రాక్టర్లో ఇటుకలు నింపుతుండగా ఒక్కసారిగా తిరగబడింది. అక్కడే పని చేస్తున్న దేవమాత అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమెది ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రొలు గ్రామంగా గుర్తించారు. పనుల నిమిత్తం కొన్నేళ్లుగా వెల్లటూరులోనే నివాసముంటున్నారు. ఈమెకి ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు జి. కొండూరు ఎస్.ఐ రాంబాబు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా.. మహిళా కూలీ మృతి - dead
కూలీ పనులకు వెళ్లిన ఓ మహిళ... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు విడిచింది. ఇటుకల బట్టీలో పనిచేసే ... అదే పని చేస్తూ మృతి చెందింది.