వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు పరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అప్పికట్ల భరత్ భూషణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద నష్టంపై నివేదికను హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోనే 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయన్నారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణ మాఫీ చేయాలని భరత్‌భూషణ్ డిమాండ్ చేశారు. పసుపు, కంద తదితర పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలన్నారు
పవన్‌కు కృష్ణానది వరద నివేదిక - bharat
కృష్ణా నది వరద నివేదికను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అప్పికట్ల భరత్ అందజేశారు. వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు పరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అప్పికట్ల భరత్ భూషణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద నష్టంపై నివేదికను హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోనే 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయన్నారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణ మాఫీ చేయాలని భరత్‌భూషణ్ డిమాండ్ చేశారు. పసుపు, కంద తదితర పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలన్నారు
Body:ఆంధ్రకేసరి జయంతి
Conclusion:ఆంధ్రకేసరి జయంతి