ఆక్సిజన్ రీ ఫిల్లర్స్తో కృష్ణా జిల్లా కొవిడ్ నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ శివ్ శంకర్ సమావేశం నిర్వహించారు. కరోనా విపత్తును ఆసరాగా తీసుకుని ఆక్సిజన్ సిలిండర్లను అధిక రేట్లకు విక్రయించవద్దని చెప్పారు. లాభాపేక్ష ధోరణితో కాకుండా.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఆక్సిజన్ కొనుగోళ్లు, నిర్వహణ, తదితర వివరాలు.. రీ ఫిల్లర్స్ను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: రెమిడిసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్