కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పర్యటించారు. మోపిదేవి మండలం కే. కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాలలో పునరావాస బాధితులను పరామర్శించారు. వరద ముంపునకు గురై పునరావాస కేంద్రంలో ఉన్న పాతఎడ్లలంక ప్రజలకు భోజనాలు అందించారు.
వరద ప్రభావంతో గత 3 రోజుల నుంచి జిల్లాలోని పలు శాఖల ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని ఎస్పీ అన్నారు. అధికారుల ఆదేశాలతో లంక గ్రామాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఎక్కడా వరద ప్రభావంతో ప్రాణ నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. మరో 2 రోజులు సహాయక చర్యలు కొనసాగిస్తామని.. పోలీసు శాఖ తరపున పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్పీ స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..