కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రు గ్రామానికి చెందిన గరికే ఏడుకొండలు అనే వ్యక్తి పోలీసులను ఒక్కసారిగా ఖంగుతిలేలా చేశాడు. నిన్న మధ్యాహ్నం చల్లపల్లి మండలం నిమ్మగడ్డ లాకుల దగ్గర దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తిని తాను హత్య చేశానని.. శవాన్ని కేఈబీ కాలువలో పడేశానని.. కూచిపూడి పోలీసు స్టేషన్కు వెళ్లి చెప్పాడు. ఇది విని ఉలిక్కిపడ్డ పోలీసులు అతడిని తీసుకుని ఘటనాస్థలికి వెళ్లారు. స్థానికులను విచారణ చేశారు. కాలువ చుట్టూ గ్రామాల్లో ఏదైనా మృతదేహం కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని మహిళా పోలీసులను చల్లపల్లి సీఐ శ్రీనివాస్ ఆదేశించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు స్టేషన్ల పోలీసులకూ సమాచారం అందించారు.
ఏడుకొండలు చెబుతున్న.. దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తి నిన్న ఉదయం నుంచి గ్రామంలో కనిపించకపోవడంపై.. అతని ఆచూకీ కోసం గ్రామంలోని బంధువులను పోలీసులు ప్రశ్నించారు. అసలు హత్య జరిగిందా..? లేక తాగిన మైకంలో ఇలా ఏడుకొండలు మాట్లాడుతున్నాడా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. వీరిద్దరూ గ్రామంలో మాంసం విక్రయిస్తుంటారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. తాగిన మైకంలో గొడవ జరిగి ఆవేశంలో హత్యచేశానని లొంగిపోయిన ఏడుకొండలు చెబుతున్నాడని అన్నారు. ఇందులోని వాస్తవాలను నిగ్గుతేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: