కృష్ణా జిల్లాలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం పట్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందడంపై సంయుక్త కలెక్టర్ మాధవీలత స్పందించారు. నీటిపై తేలియాడుతుండడంతో ప్లాస్టిక్ బియ్యంగా తల్లితండ్రులు కలవరపడుతున్నారు. ఈ బియ్యం ప్లాస్టిక్ బియ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పౌష్టిక విలువలు కలిగిన సాధారణ బియ్యంలో వంద గింజలకు ఒక గింజ ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో ఇనుము, ఫోలిక్ యాసిడ్, జింక్, విటమిన్ -బిలోని 1, 2, 3, 6, 12, విటమిన్ ఎ ఉన్నాయన్నారు. ఈ బియ్యం వినియోగించడం ద్వారా పిల్లల్లో అనీమియా వ్యాధి రాదని, నరాల వ్యవస్థ, రక్తప్రసరణ పెరుగుదలకు, వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ముందు విద్యార్థుల ఆందోళన