మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ విజయవాడలో కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ.. పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళగానే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆపేశారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే అరెస్ట్ చేయాల్సి వస్తోందని పోలీసులు హెచ్చరించారు. దీంతో రోడ్డు మీదే బైఠాయించి నినాదాలు చేశారు. వారిని బలవంతంగా లేపి.. ఇంట్లోకి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: