వలస కూలీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. వారి స్వస్థలాలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. విజయవాడ బెంజిసర్కిల్, రామవరప్పాడు కూడలి వద్ద ఏర్పాటు చేసిన వలస కూలీల వసతి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కూలీలకందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్ర కూలీలను పంపేందుకు జిల్లాల వారీగా బస్సులు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల వారిని తరలించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి : విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు