A Woman jumped into Canal Due to Instagram Love : వాళ్లిద్దరి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమికుడి కోసం ఆమె పరితపించింది. ప్రియుడి చెంతకు చేరేందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చివరికి కాలువలో దూకేసింది. ఈ ఘటన కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది.
కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు : పూర్తి వివరాల్లోకి వెళ్తే, కృష్ణ జిల్లాలోని చిట్టినగర్ పరిసర ప్రాంతానికి చెందిన ఓ యువతి (19) ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. అనంతరం ఇంటి వద్దనే ఉంటూ పనులు చూసుకునేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమయ్యాడు. ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పినా వారు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 24న ఆ యువతి కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగేసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.
"ఇన్‌స్టాగ్రామ్ రీల్ లవ్" - దండలు మార్చుకుని దారుణంగా చంపేశాడు!
అందరూ నిద్రలో ఉండగా జంప్ : చికిత్స అనంతరం ఆ యువతిని ఇంటికి తీసుకురాగా, 25వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. గాలించిన కుటుంబసభ్యులు తునిలో ఉన్నట్లు గుర్తించి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు 26వ తేదీ రాత్రి అందరూ నిద్రలో ఉండగా మళ్లీ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బస్టాండ్, రైల్వేస్టేషన్‌తో పలు ప్రాంతాల్లో వెతికారు. అనంతరం 27 తేదీ(బుధవారం) మధ్యాహ్నం సమయంలో యువతి తండ్రికి పాండు అనే వ్యక్తి ఫోన్ చేశారు.
ఇంట్లో నుంచి వెళ్లిన మీ కుమార్తె పాత పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో ఉన్న పైవంతెన నుంచి రైవస్ కాలువలోకి దూకినట్లు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకొని యువతి కోసం ఎంత గాలించిన కనిపించలేదు. దీంతో గవర్నర్‌పేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్‌స్టాలో పరిచయం - కట్‌చేస్తే ఏకంగా ఇంటికే కన్నం వేసిన బాలిక
షేర్ 'లవ్' ఆన్ స్టేటస్- వాట్సాప్‌లో ఈ క్రేజీ ఫీచర్ గమనించారా?