పామర్రులో వైకాపా అభ్యర్థి కే.ఎల్. అనిల్ మండుటెండను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నవరత్నాల గురించి వివరించారు.
ముత్యాలంపాడులో కాంగ్రెస్ సెంట్రల్ అభ్యర్థి గుర్నాధం, ఎంపీ అభ్యర్థి నరసింహారావు ఎన్నికల ప్రచారం చేశారు. ఏఐసీసీ సభ్యులు కొప్పుల రాజుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీపై గతంలో కంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరిగాయనీ...ప్రజా స్పందన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని కొప్పుల రాజు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని, మొదటి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తారని నరసింహారావు హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్నికల ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెదేపాను గెలిపించాలని కోరారు.
ఇవీ చదవండి..