పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌ను మాచవరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోరాడతో పాటు మరో నలుగురు నిందితులు సీతయ్య, రాజబాబు , బాబూరావు, అనంత్‌లను కూడా కస్టడీకి తీసుకున్నారు. నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి మాచవరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాహుల్ హత్య కేసులో నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌కు విజయవాడ కోర్టు.. రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
కీలక సమాచారం రాబట్టేందుకే..
రాహుల్ హత్య కేసులో పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీకి తీసుకున్నట్లు చెపుతున్నారు. ఇప్పటికే కీలక నిందితుడు కోగంటి సత్యంను పోలీసులు రెండు రోజుల పాటు విచారించి సమాచారం రాబట్టారు . హత్య కేసులో కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్, గాయత్రి వ్యూహ రచన చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన తర్వాత ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడని.. పోలీసులు దీనిపై విచారిస్తారని సమాచారం.
ఇదీ చదవండి:ఈ బిడ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్