కాసేపట్లో కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక(kondapalli municipal chairman election arrangements) జరుగనుంది. ఈ నేపథ్యంలో పురపాలక కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. నగర పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వైకాపా చెరో 14 చొప్పున వార్డులు గెలుచుకోగా....స్వతంత్ర అభ్యర్థి తెదేపాకు మద్దతు తెలిపారు. ఏపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి.... తెదేపా బలం 16కు, వైకాపా బలం 15కు పెరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.
అటు గొల్లపూడి నుంచి బస్సులో తెలుగుదేశం కౌన్సిలర్లు కొండపల్లికి బయలుదేరారు. ఎంపీ కేశినేని, దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ ఇతర తెలుగుదేశం నేతలు కౌన్సిలర్లతో కలిసి వస్తున్నారు. బస్సుకు రక్షణగా తెలుగుదేశం కార్యకర్తలు భారీ ర్యాలీగా ముందుకు సాగారు.
ఇదీచదవండి..
Kondapalli Municipal Chairman Election: నేడు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక