తెదేపా నేత బొండా ఉమామహేశ్వర రావు, ఆయన అనుచరుల తీరుపై.. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమకే మెజారిటీ వచ్చిందని, మాయ చేసి వైకాపాను గెలిపించారని ఉమ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన వైఫల్యాలను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆపాదిస్తూ... లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను నగర బహిష్కరణ చేయాలనీ మీడియా సమావేశాల్లో మాట్లాడిన బొండా ఉమతో పాటు.. ఆయన అనుచరులపై పరువు నష్టం దావా వేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి