తెదేపా సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించిన కోడెల తనయుడు శివరాం, అనంతరంకుటుంబ సభ్యులతో కలసి కోడెల అస్థికలను కృష్ణా నదిలో కలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని వివిధ పుణ్య నదుల్లో అస్థికలను కుటుంబ సభ్యులు కలుపుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్ వద్ద ఆయన అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
ఇదీ చూడండి: కోడెల మృతికి సంతాపంగా నరసరావుపేటలో స్వచ్ఛంద బంద్