కేఎల్ విశ్వవిద్యాలయం ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోల్పోయిందనడం అవాస్తవం అని ఆ వర్సిటీ ఉపకులపతి ఎల్ఎస్ఎస్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాద్యమాల్లో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నిరాధారమైన ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజయవాడలోని కేఎల్ వర్సిటీ పరిపాలన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు. 40 సంవత్సరాలుగా తమ సంస్థ నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు.
విద్యా రంగంలో కే ఎల్ యూనివర్సిటీ కనబరుస్తున్న ప్రతిభ వల్ల తమ విద్యా సంస్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను పొందిందన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తమ యూనివర్సిటీలో ప్రవేశాలు, విద్యా బోధన, పరిశోధనలు జరుగుతున్నాయని.... రానున్న కాలంలో దేశంలోనే తొలి 10 విద్యా సంస్థల్లో తమ యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యమని చెప్పారు. కరోనా కారణంగా అత్యాధునిక కమ్యూనికేషన్ ద్వారా అందరికన్నా ముందు నుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహించామని వివరించారు.
ఇదీ చూడండి:
ప్రొద్దుటూరు కుర్రాడి ప్రతిభ... జేఈఈలో ఆల్ ఇండియా రెండో ర్యాంకు