ETV Bharat / state

మానసిక దివ్యాంగులకు ఆసరాగా... కేడీబీ ఛారిటబుల్‌ ట్రస్టు - NEED

మానసిక దివ్యాంగుల పాలిట వరంలా వెలిసింది... కాశీనాథుని దుర్గాంబ బుచ్చయ్య ఛారిటబుల్‌ ట్రస్టు. కృష్ణా జిల్లా పామర్రు మండలం ఎలకుర్రులో 16 ఏళ్ల క్రితం పుట్టిన ఈ స్వచ్చంద సేవా సంస్థ.... మానసిక దివ్యాంగుల జీవితాలలో ఆత్మస్థైర్యం నింపుతోంది. ఉపాధి శిక్షణా తరగతులు, ఫిజియో థెరపీ సేవలు ఉచితంగా అందిస్తూ... మంచి ఆదరణ అందుకుంటోంది.

kdb-trust-needs-helps
author img

By

Published : Aug 15, 2019, 6:02 AM IST

మానసిక దివ్యాంగులకు ఆసరాగా ...కేడీబీ ఛారిటబుల్‌ ట్రస్టు

స్వగ్రామానికి సేవ చేయాలనుకున్న ప్రవాసాంధ్రుడు కాశీనాథుని సాంబశివరావు సంకల్పమే కేడీబీ ఛారిటబుల్‌ ట్రస్టు. సరిగా కూర్చోలేని, మాట్లాడలేని, తమ పనులు తామే చేసుకోలేని మానసిక దివ్యాంగులకు ఉచితంగా ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ వంటి చికిత్సలు అందిస్తున్నారు. భవిష్యత్తులో.. ఇతరులపై ఆధారపడి జీవించకుండా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. పుట్టుకతోనే మానసిక పరిస్థితి సరిగా లేని తమ పిల్లలకు ఇస్తున్న శిక్షణా తరగతులు.. ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు.

సమాజంలో తోటివారికి సహాయపడాలనే అలోచన అందరికీ ఉన్నా... ఆ అవకాశాన్ని భగవంతుడు కొందరికే ఇస్తాడని... ఆ కొందరిలో తాము ఉన్నామని.. ఇక్కడి ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 60 మందికి పైగా పిల్లలు ఇక్కడ శిక్షణ పొందేందుకు వస్తుంటారన్నారు. థెరపీ, కంప్యూటర్‌, కల్చరల్‌ విభాగాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

16 ఏళ్లుగా ఎలాంటి లాభార్జన ఆశించకుండా జిల్లాలోని మూడు మండలాల్లో కేడీబీ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నామని సంస్థ నిర్వాహుకులు కాశీనాథుని నాగేశ్వరరావు అన్నారు. నెలకు సుమారు 4 లక్షల రూపాయలతో నిర్వహిస్తున్న ఈ కేంద్రాలకు కొందరు ప్రముఖులు విరాళాలు అందించారన్నారు. సుమారు 130 మంది పిల్లలకు తమ శిక్షణ కేంద్రం ద్వారా సేవచేయడం ఆత్మ సంతృప్తిని కలిగిస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

వరద ముంపులో మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_14_protest_privateisation_of_hinustan_zinc_lands_abb_AP10148

( ) విశాఖపట్నం లోని హిందుస్థాన్ జింక్ భూములను వేదాంత కంపెనీకి ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని జింక్ నిర్వాసితులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ సీఐటీయూ కార్యాలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జింక్ నిర్వాసితుల,కార్మిక సంఘం నాయకులు ఈ యత్నాన్ని అడ్డుకోవాలని సమాజానికి పిలుపునిచ్చారు.

Body:విశాఖలోని హిందుస్థాన్ జింక్ భూములను వేదాంత కంపెనీకి అప్పగించే యత్నం చేస్తే, పెద్ద ఎత్తున పౌర ఉద్యమం చేపడతామని నిర్వాసితులు కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

Conclusion:విశాఖలో హిందుస్థాన్ జింక్ పరిశ్రమ ఏర్పాటు కోసం 1971 సంవత్సరంలో, ఆ ప్రాంత రైతులు 365 ఎకరాల భూమిని అందించారని గుర్తు చేశారు. హిందుస్థాన్ జింక్ కంపెనీ మూసివేసిన నేపథ్యంలో ఆ స్థలంలో కాలుష్యం లేని ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, నిర్వాసితులకు, ఆ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలని, లేకుంటే ఆ భూమిని తిరిగి రైతులకు అప్పజెప్పాలని నిర్వాసితులు నాయకులు డిమాండ్ చేశారు.

బైట్స్1: ఎం.జగ్గునాయుడు, ప్రధాన కార్యదర్శి, విశాఖ నగర సి.ఐ.టి. యు. ప్రధాన కార్యదర్శి.
2: పి.నారాయణ మూర్తి, కన్వీనర్, జింక్ భూముల పరిరక్షణ కమిటీ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.