ఇవీ చదవండి..
'అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా' - ప్రచారంపై
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు.
కార్తికేయ మిశ్రా
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల్లో వస్తున్న చెల్లింపు వార్తల (ప్రమోటెడ్ న్యూస్)ను పరిగణలోనికి తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటికే చెల్లింపు వార్తలకు సంబంధించి పలువురు అభ్యర్థులకు 66 నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వార్తల విలువ 19లక్షల 68 వేలుగా గుర్తించామని తెలిపారు. ఈ మొత్తం వ్యయాన్ని.. నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నికల వ్యయం.. అభ్యర్థి ఖర్చులో జమ చేస్తామన్నారు. ఎన్నికల కంట్రోల్ రూమ్‌లో MCMC టీమ్ సభ్యులు.... చెల్లింపు వార్తల అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శాసన సభ అభ్యర్థులు 28 లక్షలు, లోక్ సభ అభ్యర్థులు 70లక్షలు మించి ఖర్చు చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..
sample description