ETV Bharat / state

మంత్రి కేటీఆర్ గారూ.. ​ఆమె భర్త దేహాన్ని ఇప్పించండి : కేపీసీసీ చీఫ్ శివకుమార్ - telangana latest news

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్ డి.కె. శివకుమార్‌ ట్వీట్​ చేశారు. కర్ణాటకలోని మాండ్యాకు చెందిన శశికళ భర్త హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందారని.. ఈ ఘటనపై స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.

మంత్రి కేటీఆర్ గారూ.. ​ఆమె భర్త దేహాన్ని ఇప్పించండి : కేపీసీసీ చీఫ్ శివకుమార్

author img

By

Published : May 31, 2021, 2:43 AM IST

కర్ణాటకలోని మాండ్యాకు చెందిన మహిళ కుటుంబానికి సాయమందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్ డి.కె.శివకుమార్‌ విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలోని మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని మెడికేర్​ ఆస్పత్రిలో మృతి చెందారని, యాజమాన్యం రూ.7.5 లక్షల బిల్లు వేసినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తమ వద్ద రూ.2 లక్షలు మాత్రమే ఉన్నాయని.. అవి మాత్రమే చెల్లించగలం అని చెబుతున్నా.. మృతదేహాన్ని అప్పగించలేదని తెలిపారు.

మంత్రి కేటీఆర్ స్పందన..

శివకుమార్‌ ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాధితురాలి వివరాలు తెలియజేయాల్సిందిగా శివకుమార్‌ను కోరారు. మహిళ సహా ఆస్పత్రి బిల్లు వివరాలు తెలుసుకోవాలని తన సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు.

ఇవీ చూడండి: Medical Colleges: రాష్ట్రంలో మ‌రో 7 మెడిక‌ల్ కాలేజీలు: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.