తెలుగుదేశం పార్టీకి చైతన్య రథ సారధిగా నందమూరి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి కళా వెంకట్రావు కొనియాడారు. నందమూరి హరికృష్ణ సినీ నటుడుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా తెలుగు ప్రజల మదిలో నిలిచారన్నారు. తెలుగు ప్రజల వాణిని పార్లమెంటులో వినిపించిన ధైర్యశాలి అని...పేదలకు అండగా నిలిచి ఆపన్నహస్తం అందించిన శక్తి హరికృష్ణగా పేర్కొన్నారు. పార్టీకి ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు. తెలుగు నేలకు దూరమై రెండేళ్లు అయినా ప్రజల గుండెల్లో ఆయన ప్రతిరూపం ఇంకా మెదలాడుతూనే ఉందని తెలిపారు. తెలుగు ప్రజలకు హరికృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కళా వెంకట్రావు.. ఆయనకు నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి. హరికృష్ణ వర్ధంతి: చంద్రబాబు, లోకేశ్ నివాళి