ETV Bharat / state

'కరోనా నియంత్రణ ప్రభుత్వ అజెండాలో లేదు' - ఏపీ కరోనా వార్తలు

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతూ మరణ మృదంగం మోగుతుంటే పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజకీయాలు మాని వైరస్ నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

kala venkata rao
kala venkata rao
author img

By

Published : Jul 24, 2020, 12:12 PM IST

కరోనా నియంత్రణ ప్రభుత్వ ఎజెండాలో లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు‌ విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నిరక్ష్యం ప్రజల నిండు ప్రాణాలు తీస్తోందని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ సాధారణ జ్వరంలాంటిదే అయితే.. వైకాపా నేతలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకెళ్తున్నారని నిలదీశారు.

వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతూ మరణ మృదంగం మోగుతుంటే పాలకులకు కనిపించడం లేదా?. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. వైద్య ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామన్నారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు. అదీ అమలుకాలేదు. ఇప్పటికైనా జగన్ సంకుచిత రాజకీయాలు మాని కరోనా కట్టడి చర్యలు చేపట్టాలి. లేకుంటే శవాల దిబ్బలపై రాజ్యం ఏలాల్సి వస్తుందని గుర్తించాలి. - కళా వెంకట్రావు‌

ఇదీ చదవండి

అందని వైద్యం... ఆసుపత్రి ఎదుటే పోయిన ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.