కడప జువారి సిమెంట్ కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24న పీసీబీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జువారి సిమెంట్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అప్పటివరకూ నిర్వహించుకోవచ్చు..
ఈ మేరకు విచారించిన న్యాయస్థానం బోర్డు ఇచ్చిన సూచనలను ఈ నెల 31లోపు అమలు చేయాలని సదరు సిమెంట్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకూ కంపెనీ నడపుకోవచ్చని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఇవీ చూడండి : కర్ఫ్యూ ప్రారంభం : రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు