క్రీడా స్పూర్తి లేని ఆటగాళ్ల మద్య చోటుచేసుకున్న మనస్పర్థలు వివాదానికి దారితీసాయి. ఫలితంగా గెలిచిన జట్టుపై ఓడిపోయిన జట్టు దాడికి దిగింది. విజయవాడలో ఓ టోర్నీలో పాల్గొన్న ఇందిరాగాంధీ స్టేడియం టీం , లయోలా కాలేజీ టీం కబడ్డి ఆటగాళ్లు ఆట ముగిసాక, అర్ధరాత్రి దాడులకు దిగారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. మూడు సంవత్సరాలనుండి వారు ఓడిపోవడంతో ఇలా కొట్టారని బాధితులు వాపోతున్నారు. ఈ సంఘటనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి.ఆటోలో వెళ్తుంటే హెల్మెట్ లేదట...