KA PAUL AT MUNUGODE : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార గడువు దగ్గర పడడంతో నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారాలు నిర్వహిస్తూ ఆదరణ పొందుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్ధులు కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నాంపల్లి మండలంలో గొర్రెలు కాస్తూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తనకు ఓటేసి గెలిపిస్తే.. గ్రామానికి 20 మందికి ఉద్యోగాలు ఇస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: