రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిల్లో కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్న తమకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాలు వెల్లడించారు. త్వరలోనే ఆర్థిక శాఖ సహా వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహించి తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నట్లు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా విజయవాడలో జూనియర్ వైద్యులతో ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖీ నిర్వహించారు.
ఇవీ చూడండి : Fine: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు జరిమానా