ఈఎస్ఐ కుంభకోణంలో తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పైనా విచారణ జరపాలని వైకాపా నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో కార్మికుల సొమ్ము నిలువు దోపిడీ చేశారని జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కార్మికుల పొట్టగొట్టారని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడుతోపాటు ఈ కుంభకోణంలో ఆయనకు సహకరించిన వారందరినీ అరెస్టు చేయాలని జోగి రమేష్ అన్నారు.
"తప్పు చేసిన వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకుంటే.. కిడ్నాప్ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాయడం దారుణం. ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయడానికి అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా..?. అధికారంలో ఉండగా అచ్చెన్నాయుడు 150 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేయకపోతే..ఆ కుంభకోణానికి ఎవరు బాధ్యత వహిస్తారు. అచ్చెన్నాయుడు పాల్పడిన అవినీతిలో తెదేపా అధినేతల పాత్ర ఉంది."- వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడిపై ఈఎస్'ఐ'.. ఏసీబీ ఏం చెబుతుందంటే..?