ETV Bharat / state

నేడే జనసేన ఆవిర్భావ సభ.. ఆ ప్రధాన అంశాలపైనే పవన్​ స్పీచ్​..! - పవన్‌ కల్యాణ్ సారథ్యం

JANASENA EMERGENCE CELEBARTIONS : తొమ్మిదేళ్లుగా ఆటు పోట్లు ఎదుర్కొన్నా.. పవన్ ఛర్మిష్మాతో నిలదొక్కుకున్న జనసేన.. పదో ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా సభ సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించే విధానాన్ని పవన్ వెల్లడించే అవకాశం ఉంది.

JANASENA EMERGENCE CELEBARTIONS
JANASENA EMERGENCE CELEBARTIONS
author img

By

Published : Mar 14, 2023, 8:44 AM IST

నేడే జనసేన ఆవిర్భావ సభ..

JANASENA EMERGENCE CELEBARTIONS : జనసేన పార్టీ పదో ఆవిర్భావ వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం ముస్తాబైంది. సభ కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకూ వారాహి వాహనంలో పవన్‌ కల్యాణ్ ర్యాలీగా వెళ్లి సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొండగట్టుతో పాటు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వారాహికి పూజలు నిర్వహించిన పవన్.. తొలిసారి రాజకీయ పర్యటన కోసం వినియోగిస్తున్నారు.

ప్రజలను కలుస్తూ ముందుకు సాగనున్న పవన్​: మచిలీపట్నం వరకూ ముఖ్యమైన కూడళ్లలో స్థానికుల్ని కలుస్తూ పవన్ ముందుకు సాగుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం చేరుకోనున్న జనసేనాని.. ఆవిర్భావ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉన్నందున.. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నాయకులు, శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారు. పొత్తులు సహా వివిధ అంశంపై పార్టీ వైఖరిని పవన్‌ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది.

విపక్షాల ఓట్లు చీలకుండా చేయటమే లక్ష్యంగా: గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ సభలోనే.. విపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని పవన్ ప్రకటించారు. అదే విధానానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తర్వాత కూడా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. కొన్ని నెలల క్రితం విజయవాడలో పవన్‌తో భేటీ అయ్యారు. మరికొన్ని రోజులకు హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి పవన్‌ వెళ్లారు.

విపక్షాల ఓట్లు చీలకూడదన్న పవన్‌ ప్రకటనలపై ఆయా భేటీల్లో చర్చ జరిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి నడవాలని ఇద్దరు నేతలు అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. ఉమ్మడి కార్యాచరణ లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ విధానం ఏంటన్నది.. ఇవాళ్టి సభలో పవన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపుల సంక్షేమంపై కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.

2014లో పురుడుపోసుకున్న జనసేన: పవన్‌ కల్యాణ్ సారథ్యంలో 2014 మార్చి 14న పురుడు పోసుకున్న జనసేన.. ఒడుదొడుకుల్ని తట్టుకుని ముందుకు సాగుతోంది. పార్టీ పుట్టిన కొన్నాళ్లకే ఎన్నికలు రావడంతో అప్పట్లో పోటీకి దూరంగా ఉన్నా... తెలుగుదేశం, బీజేపీ కూటమికి పవన్ మద్దతిచ్చారు. ఆ తర్వాత కూడా కూటమితో కలిసి సాగిన ఆయన.. 2019 ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలకు దూరం జరిగారు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలవగా.. పార్టీ పరాజయం పాలైంది.

పవన్ కల్యాణ్ స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. పార్టీ తరపున రాపాక వరప్రసాద్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మళ్లీ బీజేపీతో జట్టు కట్టిన పవన్.. నాలుగేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఇసుక కొరతపై ఉద్యమించారు. ఉపాధి కోల్పోయిన కూలీల కోసం కొన్ని రోజులు ఆహార కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు, రోడ్ల దుస్థితిపై నిరసలకు దిగారు. అమరావతి నుంచి రాజధాని మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సాగు గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు.. లక్ష రూపాయలు చొప్పున సాయం అందజేశారు. పార్టీ 9వ ఆవిర్భావ సభకు స్థలమిచ్చిన ఇప్పటం గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగినప్పుడు.. వారికి అండగా నిలిచారు. వైసీపీ ఆగడాలు, ఆ పార్టీ నేతల కబ్జాలు, మహిళలపై అకృత్యాలు, గంజాయి రవాణా సహా వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు గట్టిగా గళం వినిపిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంపై విమర్శలు, దూషణలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.