జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో పార్టీ నేతలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. జనసేన మహిళా నేత రావి సౌజన్య ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గo పరిధిలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతగా నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు సౌజన్య వెల్లడించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి కష్ట కాలంలో కేసుల పేరిట వేధింపులేంటి..?'