ETV Bharat / state

janasena: ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా?: జనసేన - నాదెండ్ల మనోహర్ వార్తలు

జాబ్ క్యాలెండర్(job calendar) పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని జనసేన పార్టీ ఆరోపించింది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా? అని ప్రశ్నించింది. గ్రామ వాలంటీర్లది స్వచ్ఛంద సేవ అని చెప్పిన ముఖ్యమంత్రి... ప్రచారం కోసం ఉద్యోగాలని చెబుతున్నారని ఎద్దేవా చేసింది. శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది

Janasena
జనసేన
author img

By

Published : Jun 18, 2021, 10:17 PM IST

జాబ్ క్యాలెండర్(job calendar) పేరుతో ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని జనసేన పార్టీ ఆరోపించింది. ఏపీపీఎస్సీ(appsc) ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా? అని ప్రశ్నించింది. డీఎస్సీ గురించి స్పష్టత ఇవ్వాలని కోరింది. గ్రామ వాలంటీర్లది స్వచ్ఛంద సేవ అని చెప్పిన ముఖ్యమంత్రి... ప్రచారం కోసం ఉద్యోగాలని చెబుతున్నారని ఎద్దేవా చేసింది. శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఎన్నికలకు ముందు ఏపీపీఎస్సీ ద్వారా 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మాట మార్చి మడమ తిప్పిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

డీఎస్సీ మాటేమిటి..

రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటి భర్తీకి సంబంధించి డీఎస్సీ(dsc) గురించి ఎందుకు మాట్లాడటం లేదని జనసేన నేతలు నిలదీశారు. సర్కార్​కు ఉపాధ్యాయ పోస్టులు నింపే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని.. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీల మాటేమిటి? అని ప్రశ్నించారు. ఆర్టీసీలో 51 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా వైకాపా వాళ్లు నియమించినట్లు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.

ఇదీ చదవండి

AP Jobs: జాబ్ క్యాలెండర్​ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.