కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటీవల దుర్గ గుడి ఫ్లైఓవర్ పనుల నిమిత్తం... హైదరాబాద్ వైపు భారీ లారీలు వెళ్లేందుకు కొత్తూరు-తాడేపల్లి రహదారి ప్రత్యామ్నాయ మార్గంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతూ... రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దుమ్ముధూళితో జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి, షాబాద్, వెలగలేరు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లారీలు గ్రామం నుంచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి.దిశ ఎన్కౌంటర్తో వెల్లివిరిసిన ఆనందం