తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆస్తుల విక్రయాల నిర్ణయాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకునేంత వరకు పోరాటం సాగిస్తామని భాజపా, జనసేన నేతలు తెలిపారు. నిరర్థకం పేరుతో చేసే అమ్మకాలను ఎవరూ ప్రశ్నించకపోతే మున్ముందు పెద్ద మొత్తంలో ప్రభుత్వం విక్రయాలు సాగిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో విజయవాడ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఉపవాస దీక్షచేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల ఆస్తులను కాపాడే సమర్ధత లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: