ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధినేత పనన్ కల్యాణ్ కోరారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి 8 వేల మంది డ్రైవర్లకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించినట్లే వీరి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వీరు ఆర్టీసీ ఉద్యోగులు కానందున జీతాల వ్యవహారం అద్దె బస్సుల యజామానులే చూసుకోవాలని ప్రభుత్వం, ఆర్టీసీ భావించడం సరికాదని జనసేనాని అన్నారు. ఈ బస్సుల నిర్వహణ, మరమ్మతులపై ఆధారపడిన కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలని కోరారు.
ఇదీ చూడండి..
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.. 17 నుంచి కర్ణాటకకు బస్సులు