పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి తిరునాళ్లు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో జలబిందెలకార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన కొందరు మట్టికుండలతో మున్నేరు నదికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుండల్లో నీరు తీసుకుని వేడుకగా ఆలయానికి చేరుకున్నారు. మేళ తాళాలు, మంగళవాద్యాలు, కోలాటాలు నడుమ ఉత్సవం ఆలయం వరకు శోభాయమానంగా సాగింది.
జలబిందెలు తెస్తున్న వారికి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్థులు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం స్టేషన్ ఎస్ఐ దుర్గారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జలబిందెల ఊరేగింపు ఆలయం వరకు కొనసాగింది. దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో నవధాన్యాలు చల్లి నీళ్ళతో మట్టికుండలను ఉంచుతారు. నవధాన్యాల్లో ఏవి ఎక్కువ మొలకలు వస్తాయో.. ఆ ఏడాది ఆ పంటలు ఎక్కవగా పండుతాయని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి సభ్యులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
ఇవీచదవండి
కమనీయం..శ్రీనివాసుని కల్యాణం..
కమనీయంగా కల్యాణం