ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో అసభ్య పోస్ట్ పెట్టిన ఘటనపై కేసు నమోదైంది. రేగుంట గ్రామానికి చెందిన శ్రీధర్ల శాంత్ కుమార్ తన ఫేస్ బుక్ అకౌంట్లో 28 తేదీన జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన కృష్ణ అసభ్యంగా స్పందించాడు. ఈఘటనపై శ్రీధర్ల శాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి కృష్ణను అరెస్ట్ చేశారు. ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నూజివీడు సీఐ రామచంద్రరావు తెలిపారు.
ఇది కూడా చదవండి.