పనస చెట్టు మొదలు చుట్టు కాయలు కాయటం అందరిని అబ్బుర పరుస్తోంది. కృష్ణాజిల్లా నందిగామ కాకానినగర్లో రామానుజమ్మ అనే మహిళ ఇంటి ఆవరణలో 20 ఏళ్ల క్రితం పనస చెట్టును నాటారు. ఆవరణ మొత్తం ఉసిరి, మామిడితో పాటు ఇతర చెట్లతో పచ్చదనంతో నిండి ఉంటుంది. వీటిల్లో పనస చెట్టు మొదలు చుట్టూ 30కి పైగా కాయలు కాశాయి. ఇంకా పూత ఉంది. కొమ్మలు లేకుండానే మొదలుకి అన్ని కాయలు కాయటం విశేషం. చెట్టుపై కొమ్మలకు పెద్దగా కాయలు రాలేదు. ప్రత్యేకంగా ఎటువంటి ఎరువులు , పోషణ చేయకపోయిన మొదలు చుట్టూ కాయలు కాయటం గమనార్హం. భూమిలో బలం ఉండటం వల్ల మొదలుకి పూత వచ్చి ఎక్కువ కాయలు కాశాయని.. నందిగామ ఉద్యానవన శాఖా అధికారిని నీలిమ తెలిపారు.
ఇదీ చదవండి: కనులకు అందం.. కవలల బంధం