కృష్ణా జిల్లా విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్రస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి... ప్రభుత్వ కార్యదర్శి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సంఘ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని...11వ పీఆర్సీ నివేదికను యథాతధంగా ఆమోదించాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి...ఒక ఉద్యోగికి ఒకే ఉద్యోగ సంఘంలో సభ్యత్వం ఉండే విధానాన్ని తీసుకురావాలని కోరారు.
ఇదీ చూడండి: