తూర్పు కృష్ణా కాలువకు నీటి విడుదల ఘనంగా జరిగింది. జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు పాల్గొని కృష్ణమ్మకు పూజలు చేసి అనంతరం కృష్ణా తూర్పు కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు తక్కువ కావడం, గోదావరి నీరు ఆలస్యంగా రావడంతో జలై 12న నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. అయితే ఆయకట్టులోని చివరి ఎకరా వరకూ నీరు అందించడానికి ప్రయత్నం చేస్తామని, రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఈరోజు సుమారు తూర్పు కృష్ణా కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
ఇదీ చూడండి 'మెప్మా పీడీలు వారధిగా ఉండాలి'