గన్నవరం ఎయిర్పోర్ట్లో అధునాతన పరికరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే అతి తక్కువ విమానాశ్రయాలకు సమకూరే అతి ఖరీదైన బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ పరికరాలను విజయవాడ విమానాశ్రయంలో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు అన్నారు. విమానాశ్రయ భద్రత సిబ్బంది స్థానిక పోలీసుల సమన్వయంతో ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా వ్యవస్థ కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి:
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం జగన్