కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు పరిధిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు అనంతపురం జిల్లాకు చెందిన దాసరి లాస్యగా పోలీసులు గుర్తించారు. సాయంత్రం ట్యూషన్ సమయంలో వసతి గృహంలోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా..ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీచదవండి