సత్యనారాయణపురంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభం మేకలం ఊడి తలమీద పడటంతో ఓ భక్తురాలు గాయపడింది. ఆకాశదీపాన్ని అర్చకులు కడుతున్న సమయంలో మేకలం ఊడి.. మాణిక్యాంబ అనే భక్తురాలి తలపై పడింది. సిబ్బంది స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఆమె తలకు రెండు కుట్లు పడ్డాయని ఆలయ ఈవో సీతారామయ్య తెలిపారు. ఘటన సమయంలో భక్తులు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. మేకలం ఊడి పడిన తర్వాత ఆలయాన్ని మూసివేశామని, ప్రాయశ్చిత్త సంప్రోక్షణ అనంతరం తిరిగి మంగళవారం యథావిధిగా దర్శనానికి అనుమతిస్తామన్నారు.
ఘటన స్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తేదేపా నాయకులు జయసూర్య, స్ధానిక తేదేపా నాయకులతో కలిసి పరిశీలించారు. భక్తురాలు గాయపడటం బాధకరమన్నారు. దేవాలయ నిర్వాహాక కమిటీ శ్రద్ధ వహించి వెంటనే నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవీ చదవండి: