విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ వి.ఎస్.పతానీయ సమావేశమయ్యారు. మారిటైమ్ సెక్యూరిటీ అంశాలపై కోస్ట్ గార్డ్ అధికారులు గవర్నర్‌తో చర్చించారు. "హబ్ అండ్ స్పోక్" భావనను సమర్థవంతంగా స్థాపించడానికి కోస్ట్ గార్డ్ మెరైన్... పోలీసులతో కలిసి ఎలా పని చేయబోతుందో వివరించారు. మత్స్యకారుల భద్రతా సమస్య, ప్రకృతి విపత్తు సమయంలో జారీచేసే హెచ్చరికలను ఈ సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి: 'సామాన్యులనూ ఆర్టీసీలో ప్రయాణించనివ్వండి'