ETV Bharat / state

కృష్ణాజిల్లాలో 9 మంది విద్యార్థినులకు అస్వస్థత - krishna districts

students
students
author img

By

Published : Apr 7, 2022, 10:43 PM IST

Updated : Apr 7, 2022, 11:44 PM IST

22:34 April 07

వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిన గురుకుల పాఠశాల బాలికలు

Illness for students: కృష్ణాజిల్లాలో 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. గుడివాడ మండలంలోని మోటూరు గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వెంటనే వారిని పాఠశాల సిబ్బంది... గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విద్యార్థులు వ్యాయామం చేస్తుండగా విద్యార్థినులు స్పృహ తప్పారని హాస్టల్ వార్డెన్ తెలిపారు. బాధిత విద్యార్థులంతా 6, 7 తరగతులకు చెందినవారని తెలిపారు. ఆహారం కారణంగానే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికల వైద్యసేవలను రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: Baby at roadside: "నేనేం పాపం చేశానమ్మ... నన్నేందుకు ఇక్కడ వదిలేశారు"

Last Updated : Apr 7, 2022, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.