ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యాన్ని తీసుకువచ్చేందుకు అక్రమాలకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొరియర్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు తనిఖీల్లో ఈ విషయం తాజాగా బయటపడింది. పెనమలూరు, నున్న, గన్నవరం, కృష్ణలంక ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. కృష్ణలంకలోని ఓ కొరియర్ సర్వీస్ ద్వారా ప్యాకింగ్ చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సరఫరా చేస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కొరియర్ మాటున తరలిస్తున్న 2 వేల 804 మద్యం సీసాలను ఒక లారీ, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ప్రత్యేక అధికారి సత్తిబాబు తెలిపారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇంతియాజ్