కృష్ణాజిల్లా చాట్రాయి మండలం గొల్లగూడెంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారపక్ష నేతలు, అధికారులు కుమ్మకై మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై మైనింగ్ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల వెనుక కుట్ర'