ETV Bharat / state

పోలవరం కుడి కాలువ వద్ద తవ్వకాలపై హైకోర్టు స్టే - Krishna District important news

Polavaram Right Cannal Ilegal Mining updates: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో దాదాపు 55 కిలోమీటర్ల మేర ఉన్న పోలవరం కుడి కాలువ వద్ద గతకొన్ని నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతుందని, చాలా ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారని.. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన సురేంద్ర బాబు ఇటీవలే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం కుడి కాలువ కట్టపై మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని.. గతంలో ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇష్టారీతిగా తవ్వకాలను జరుపుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఈ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. తవ్వకాలపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Polavaram_
Polavaram_
author img

By

Published : Mar 6, 2023, 5:51 PM IST

Polavaram Right Cannal Ilegal Mining updates: ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో గతకొన్ని నెలలుగా దాదాపు 55 కిలోమీటర్ల మేర ఉన్న పోలవరం కుడి కాలువ వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందని, చాలా ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారని.. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన సురేంద్ర బాబు ఇటీవలే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం కుడి కాలువ కట్టపై మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని.. గతంలో ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ నేటికీ ఇష్టారీతిగా తవ్వకాలను జరుపుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఈ అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. తవ్వకాలపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశిస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పటిషన్: వివర్లాలోకి వెళ్తే.. పోలవరం కుడి కాలువ వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందని గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన సురేంద్ర బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 55 కిలోమీటర్ల మేర కుడి కాలువ ఉందని.. చాలా ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు పిటిషనర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కోట్ల రూపాయల విలువ చేసే మట్టి, గ్రావెల్ అక్రమంగా తరలించారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం తవ్వకాలపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఇరిగేషన్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

అసలు ఏం జరిగిందంటే: గతకొన్ని నెలలుగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పోలవరం కుడి కాలువ వద్ద అక్రమ మైనింగ్ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీంతో స్థానికులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అక్రమ మైనింగ్‌ను వెంటనే ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేశారు. అయిన కూడా అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో అధికార పార్టీ నేతలు మరింతగా చెలరేగిపోయారు. ఇష్టానుసారంగా విజయవాడ గ్రామీణ మండలం నుంచి బాపులపాడు వరకు దాదాపు 30 కిలోమీటర్ల పోలవరం కట్టలపై తవ్వకాలు జరిపారు. తవ్వకాల సమయంలో సంబంధంలేని కాగితాలను వాహనాలకు అతికించుకుని తమకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయంటూ స్థానికులను మభ్యపెట్టి..సుమారు 500 మీటర్లకు ఒక రీచ్‌ చొప్పున, 20 అడుగుల వరకు తవ్వకాలు జరిపారు.

పోలవరం కుడి కాలువ మొత్తం పొడవు 174 కిలోమీటర్లు. అందులో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 55 కిలో మీటర్లు ఉంది. అంటే 118 నుంచి 174 కిలోమీటరు వరకు ఉంది. గతంలో జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత నూజివీడు, ఆగిరిపల్లి మండలాల పరిధి తగ్గడంతో అక్కడా కూడా తవ్వకాలను జరపటం మాత్రం ఆగలేదు. వందలకొద్దీ టిప్పర్లు గ్రామాల మధ్యలోంచి తిరుగుతుంటే.. దుమ్ము ధూళి గ్రామాల్లోని ఇళ్లన్ని కమ్ముకుని ప్రజలు వ్యాధులబారిన పడ్డారు.

ఏలూరు జిల్లాలో అక్రమ తవ్వకాలు: మరోవైపు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో మట్టి, గ్రావెల్ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలవరం కుడి కాలువ వద్ద ఉన్న మట్టి గుట్టలను, కాలువ గట్లను, కొండ గుట్టలను ప్రోకెయిన్లతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిగాయి. కళ్లముందు ఇన్ని అక్రమాలు జరుగుతున్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇరిగేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేయండి: ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్న మట్టి, గ్రావెల్‌ను అక్రమాలపై.. గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన సురేంద్ర బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే మట్టి, గ్రావెల్‌ను తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తవ్వకాలపై స్టే విధిస్తూ, ఇరిగేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.