తమ గోడును విన్నవించుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును కలిసేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఎంపీఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ప్రజాస్వామ్యంలో సమస్యను విన్నవించుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. విజయవాడ దాసరి భవనంలో ఆయన మాట్లాడారు. నాలుగు సంవత్సరాల నుంచి రైతులకు వివిధ రూపాల్లో సేవలు చేస్తున్న బహుళ ప్రయోజనాల విస్తరణాధికారుల జీవితాలను అగాధంలోకి నెట్టేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగాల పేరుతో తమను విధుల్లో నుంచి తీసెయ్యాలని చూడడం సరికాదన్నారు. ఇకనైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి.. ఉద్యోగ భద్రత కోసం ఏఎన్ఎమ్ల ఆందోళన