వక్ఫ్ బోర్డు పాలక మండలిని రద్దు చేస్తూ ఈనెల 15న రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం ముందు సర్కారు అప్పీలు దాఖలు చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు గురువారానికి వాయిదా వేశారు.
అసలేమైందంటే....?
వక్ఫ్ బోర్డు పాలక మండలి రద్దుకు సంబంధించి మైనార్టీ సంక్షేమశాఖ ఈనెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పాలక మండలి ఏర్పడే వరకు, రానున్న ఆరు నెలల వరకు రద్దు నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఏపీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రభుత్వ నిర్ణయంతో బోర్డు సభ్యులు కొంతమంది ఆ జీవోను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఆ జీవో అమలును సస్పెండ్ చేస్తూ ఈనెల 18న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి, వక్ఫ్ బోర్డు సీఈవో, ప్రత్యేక ఆధికారి ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు.
ఇదీ చదవండి : "నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్ఐఓ