రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఎయిడ్స్ ఖైదీ చికిత్స కోసం బెయిల్ కావాలని వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సంబంధింత అధికారులకు కోర్టు పలు సూచనలు చేసింది. జైలులోకి వచ్చేటప్పుడు ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధరణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించింది. ఎయిడ్స్ ఖైదీలకు ప్రత్యేకంగా వైద్య సదుపాయాలు కల్పించాలని, ఒకవేళ జైలులో అందుబాటులో లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిచాలని, వైద్యులు సూచించిన విధంగా పోషకాహర విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించింది. ఎంతమందికి ఖైదీలకు ఎయిడ్స్ ఉందనే విషయంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని కోరింది. స్వలింగ సంపర్కం జరిగే ప్రమాదం ఉన్నందున దాన్ని జరగకుండా జైలు అధికారులే చూసుకోవాలని తెలిపింది.
ఇదీ చూడండి:వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసేందుకు రోబోలు