ETV Bharat / state

'ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలి' - విజయవాడ నేటి వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కోరారు. లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'Help to artists because they loss their jobs in lockdown' says farmer  MLA in vijayawada
విజయవాడలో ఐఎస్​సీయూఎఫ్ సమావేశం
author img

By

Published : Jun 2, 2020, 12:53 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కోరారు. ఐఎస్​సీయూఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఐక్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల వారికి అందిస్తున్న నగదు సహాయాన్ని కళాకారులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

విజయనగరంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.