విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణమ్మ పరుగులు తీస్తూ నాగార్జునసాగర్, పులిచింతలను దాటుకుని బెజవాడకు చేరుకుంటోంది. మార్గంమధ్యలో పలు ఉపనదుల కలయికతో ఉద్దృతంగా దిగువకు పరుగులు తీస్తోంది. ఇప్పటికే నిండుకుండను తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ అఖండంగా దర్శనమిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లక్ష క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుండటంతో అంతే ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు
ఇదీచదవండి