ETV Bharat / state

విజయవాడలో భారీ వర్షం..ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు - krishna dist latest news

కృష్ణాజిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

heavy-rains-in-vijayawada
విరిగిపడిన కొండచరియలు
author img

By

Published : Oct 13, 2020, 2:19 PM IST

విరిగిపడిన కొండచరియలు

విజయవాడలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో ఓంకారం మలుపు వద్ద రాళ్లు రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండటంతో భక్తులెవ్వరినీ ఘాట్‌ రోడ్ నుంచి అనుమతించలేదని.. దీనితో ప్రాణ నష్టం తప్పిందని తెలిపారు. ఘాట్‌రోడ్‌లో దసరా ఉత్సవాల నేపథ్యంలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కారణంగా పనులు కూడా నిలిపివేశామని అధికారులు చెప్తున్నారు. ఘాట్‌ రోడ్‌పై పడిన కొండ చరియలను జేసిబిలతో తొలగిస్తున్నారు.

ఇదీ చదవండి: వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.